క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ఫ్రాడ్స్.. హెచ్చరిస్తున్న పోలీసులు

క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ఫ్రాడ్స్.. హెచ్చరిస్తున్న పోలీసులు
  • జాగ్రత్తగా ఉండాలంటున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

గచ్చిబౌలి,వెలుగు: ఓల్డ్ ఐటమ్స్ ను అమ్మడం, కొనడం చేస్తామంటూ ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్ లలో యాడ్స్ పెడుతూ సైబర్ క్రిమినల్స్ మోసాలు చేస్తున్నారని..క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి డబ్బులు కొట్టేస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫ్రాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలని గురువారం పోలీసులు ఓ ప్రకటనలో సూచించారు.  ఇటీవల ఈ తరహా మోసాలపై బాధితుల నుంచి తమకు కంప్లయింట్స్ వచ్చాయన్నారు.

సోఫా సెట్ కొంటామని రూ.99 వేలు కొట్టేసిన్రు 

కూకట్​పల్లి ప్రాంతానికి చెందిన  ఓ మహిళ ఈ నెల 17న తన ఇంట్లోని సోఫా సెట్ ను రూ. 23,500కు అమ్మేందుకు ఓల్ఎల్ఎక్స్ లో ఫొటోలు అప్ లోడ్ చేసింది. ఓ వ్యక్తి ఆ మహిళకు కాల్ చేసి తన పేరు వినోద్ కుమార్ అని..తాను ఆ సోఫా సెట్ ను కొంటానని చెప్పాడు. అడ్వాన్స్ మనీ ఇస్తానంటూ క్యూఆర్ కోడ్ ను మహిళ మొబైల్ కి పంపించాడు. క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేస్తే మీ అకౌంట్​లో అడ్వాన్స్ మనీ వస్తాయని ఆమెతో చెప్పాడు. దీంతో ఆ మహిళ కోడ్​ను స్కాన్​ చేయగా  రూ.1, రూ.2 ఇలా ఆమె ఎస్​బీఐ అకౌంట్​లోకి వచ్చాయి.  తర్వాత వినోద్​ కుమార్​ పంపించిన మరికొన్ని క్యూఆర్​ కోడ్​లను ఆ మహిళ స్కాన్​ చేయగా.. ఆమె బ్యాంక్​ అకౌంట్ నుంచి రూ. 99,500 డెబిట్ అయ్యాయి.  దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ మహిళ సైబర్​ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఇదే తరహాలో సుచిత్ర ప్రాంతానికి చెందిన ఓ మహిళకు క్యూఆర్ కోడ్ పంపించిన సైబర్ క్రిమినల్స్ రూ. 57 వేలు కొట్టేశారు. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ రెండింటిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యూఆర్​ కోడ్ లు పంపి మోసాలు చేస్తున్నది రాజస్థాన్ కు చెందిన గ్యాంగ్ గా పోలీసులు చెప్తున్నారు.  క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి పేమెంట్​ చేయడం, డబ్బులను రిసీవ్​ చేసుకునే టైమ్ లో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో, ఓఎల్​ఎక్స్​లో పెట్టే యాడ్స్​ను నమ్మొద్దంటున్నారు.

For More News..

ఫిట్​మెంట్ 43% పైనే ఇయ్యాలి.. తగ్గిస్తే తడాఖా చూపిస్తం..

ఎయిడెడ్ స్కూళ్లలో భారీగా ఖాళీలు

జై భారత్.. జై శ్రీరాం.. జై కేసీఆర్​ అనాలె