సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద మంగళవారం ఆపరేషన్ నిర్వహించి అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఈక్రమంలో నిందితులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని వస్తున్న వార్తలపై రాజేంద్రనగర్ డీసీపీ క్లారిటీ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. భారీగా గంజాయి తరలిస్తున్న 7గురి ముఠాను గుర్తించారు పోలీసులు. ముఠాలోని ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రూ.88లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్ డిసిపి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ ఠాగూర్ సింగ్ తో పాటు వినోద్ అనే వ్యక్తలు ముఠాలో కీలకమైన నిందితులు. ఇద్దరూ కలిసి గత 5 సంవత్సరాలుగా గంజాయి విక్రయిస్తున్నారు. ఇద్దరు గంజాయిని అరకులో కొని ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో అమ్ముతుంటారు. అరకులో రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి కొని ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ జిల్లా కు తరలిస్తుంటారు.
ALSO READ | రాజేంద్రనగర్లో గంజాయి ముఠా కాల్పులు..వెంటాడి పట్టుకున్న పోలీసులు
అరకులో రాజు దగ్గర 254 కేజీల గంజాయి కొని కారులో హైదరాబాద్ మీదుగా తరలించే ప్రయత్నించారు. ఒరిస్సా నెంబర్ ప్లేట్ కారులో గంజాయి ప్యాక్ చేసి తరలిస్తున్నారు. మరో కారు ఎస్కార్ట్ గా ముందు వెళ్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సెట్ నెంబర్ 17 వద్ద గంజాయిని వేరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెళ్లి ఐదుగురిని పట్టుకునే లోపు మరో ఇద్దరు పరార్ అయ్యారు. నిందితులను పట్టుకునే క్రమంలో ఫైరింగ్ జరిగిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. సీజ్ చేసిన గంజాయిని కిలో రూ.38000 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మొత్తం పట్టుబడిన గంజాయి విలువ రూ.88 లక్షలు.