ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై ఎస్ఓటీ (SOT) పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేపట్టారు. 8 పీఎస్‌ల పరిధిల్లో రూ.7.47 లక్షల విలువైన 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిర్వహిస్తున్న ఎనిమిది మద్యం షాపులపై పోలీసులు దాడి చేశారు. లైసెన్స్ లేకుండా అధిక ధరలకు లిక్కర్ అమ్ముతున్నారు. లైసెన్స్ ఉన్న షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. షాపులపై కేసులు నమోదు చేశారు.