
గచ్చిబౌలి, వెలుగు : ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరంలొనే ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో 7 వ సైబరాబాద్ ఆన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. సైబరాబాద్ సీపీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 24 వరకు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ లో 5 కమిషనరేట్ల నుంచి 9 టీమ్స్2 పాల్గొంటున్నాయని సీపీ తెలిపారు. అనంతరం సీపీ ఇతర అధికారులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.