ఐటీ కారిడార్​లో 4 కోట్ల హెరాయిన్ పట్టివేత

ఐటీ కారిడార్​లో 4 కోట్ల హెరాయిన్ పట్టివేత
  • 620 గ్రాములు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్​ ఎస్​వోటీ పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ లోని ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ముఠాను సైబరాబాద్ ఎస్ వోటీ, టీజీ న్యాబ్​అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్మేందుకు ఐటీ కారిడార్​కు వచ్చిన నలుగురు డీలర్లు, డ్రగ్స్​కొనేందుకు వచ్చిన నలుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ.4 కోట్ల విలువైన 620 గ్రాముల హెరాయిన్​స్వాధీనం చేసుకున్నారు. 

గచ్చిబౌలిలోని టెలికాంనగర్​వద్ద డ్రగ్స్​అమ్ముతున్నట్టు గుర్తించి.. ఆ ప్రాంతంలో సైబరాబాద్ పోలీసులు, టీజీ న్యాబ్​అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రాజస్థాన్ కు చెందిన నలుగురు డీలర్లు హెరాయిన్ ను టెలికాంనగర్​వద్ద సిటీకి చెందిన నలుగురికి అమ్ముతుండగా పట్టుకున్నారు. వీరి వద్ద 620 గ్రాముల హెరాయిన్, రెండు కార్లు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ రూ.4 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్​చేసి విచారిస్తున్నట్టు చెప్పారు.