గచ్చిబౌలి ఫ్లైఓవర్ మళ్లీ​ క్లోజ్.. ట్రాఫిక్​ డైవర్షన్.. ఇటు నుంచే వెళ్లాల్సింది

గచ్చిబౌలి ఫ్లైఓవర్ మళ్లీ​ క్లోజ్.. ట్రాఫిక్​ డైవర్షన్.. ఇటు నుంచే వెళ్లాల్సింది

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి జంక్షన్​వద్ద ఔటర్ రింగ్​ రోడ్డు నుంచి కొండాపూర్​రూట్​లో జరుగుతున్న శిల్పా లేఅవుట్​ ఫ్లైఓవర్ ఫేజ్​2​ నిర్మాణ పనుల కారణంగా ఏడు రోజులపాటు (ఈ నెల 28 అర్ధరాత్రి వరకు) గచ్చిబౌలి ఫ్లైఓవర్​ను క్లోజ్​ చేస్తున్నట్లు సైబరాబాద్ ​ట్రాఫిక్ జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్ తెలిపారు. బయో డైవర్సిటీ జంక్షన్​ నుంచి ఐఐఐటీ జంక్షన్​ వైపు వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్ ​కింద నుంచి, ఐఐఐటీ జంక్షన్ ​నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ ​వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్​ పక్కనుంచి వెళ్లాలని సూచించారు. 

పనులు స్లో.. తప్పని ట్రాఫిక్​ ఇబ్బందులు

కొద్ది నెలలుగా శిల్పా లేఅవుట్ ​ఫ్లైఓవర్ ఫేజ్​2 పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ఈ రూట్​లో ట్రాఫిక్​ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ట్రాఫిక్​లో నరకం చూస్తున్నారు. ఫ్లైఓవర్​నిర్మాణ పనుల కారణంగా ఈ రూట్​​లో సైబరాబాద్ ట్రాఫిక్​ పోలీసులు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గచ్చిబౌలి ఫ్లైఓవర్​ను క్లోజ్​చేసి డైవర్షన్​ విధించారు. గతంలోనూ ఒకటి, రెండుసార్లు ఫ్లైఓవర్​ను వారంపాటు క్లోజ్ చేశారు తప్పితే పనులను తొందరగా పూర్తి చేయలేదు.