హైదరాబాద్ సిటీలో తాగి బండి నడుపుతూ ఒకేరోజు 218 మంది దొరికిన్రు !

హైదరాబాద్ సిటీలో తాగి బండి నడుపుతూ ఒకేరోజు 218 మంది దొరికిన్రు !

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ డ్రైవ్​డ్రైవ్‌‌‌‌లో 218 మంది పట్టుబడ్డారు. అత్యధికంగా శంషాబాద్​పీఎస్​లో 22 కేసులు నమోదు కాగా, బాలానగర్, అల్వాల్ ​ట్రాఫిక్ ​పోలీస్​స్టేషన్ల పరిధిలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. మియాపూర్​ పీఎస్​పరిధిలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

పట్టుబడిన వాహనాల్లో 176 టూ-వీలర్లు, 19 త్రీ వీలర్లు, 23 ఫోర్-వీలర్లు ఉన్నాయి. ఈ డ్రైవ్​లో పట్టుబడిన వారిలో మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. 218 మందిలో 31-నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వారు 96  మంది ఉండగా, 21-– -30 ఏండ్ల మధ్య ఉన్న వారు 76 మంది ఉన్నారు. 18–20 ఏండ్ల మధ్య ఉన్నవారు నలుగురు దొరికారు.