గచ్చిబౌలి, వెలుగు: ట్రాఫిక్సమస్యకు చెక్పెట్టడంతోపాటు వెహికల్స్రద్దీని నియంత్రించేందుకు సైబరాబాద్పోలీసులు ‘సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ఫ్లాట్ఫామ్’ను అందుబాటులోకి తెచ్చారు. ఈ అప్లికేషన్ను శుక్రవారం కమిషనరేట్ ఆఫీసులో సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రారంభించారు.
టాన్లా ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఈ కొత్త వ్యవస్థను రూపొందించారు. ఇందులో కమిషనరేట్పరిధిలో ట్రాఫిక్ జామ్, వాహనాల రద్దీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు.