సైబర్ ​నేరగాళ్లు రూ. 1.72 లక్షలు దోచేశారు!

సైబర్ ​నేరగాళ్లు రూ. 1.72 లక్షలు దోచేశారు!
  • యాదాద్రి పోలీసులకు బాధితుడి కంప్లయింట్ 

యాదాద్రి, వెలుగు : సైబర్​నేరగాళ్లు నమ్మించి వ్యక్తి వద్ద రూ. లక్షల్లో కొట్టేసిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన గోసాల శ్యామలరావు ఏడాదిన్నర కింద ఉపాధి కోసం యాదాద్రి జిల్లా రాయగిరికి వచ్చి ఉంటూ ప్రైవేటు సంస్థలో సూపర్​వైజర్​గా చేస్తున్నాడు. ఈనెల15న పార్ట్​టైమ్​జాబ్​కోసం గూగుల్​లో సెర్చ్​చేసి లింక్​ఓపెన్​చేశాడు. 

అనంతరం అతడి ఫోన్​నంబర్ కు 9336889968 నుంచి వీడియో లింక్​వచ్చింది. దాన్ని చూసి లైక్​కొట్టి ఎక్కువ మందికి షేర్​చేస్తే.. ఇంట్లో నుంచే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని సైబర్ నేరగాళ్లు నమ్మించి టాస్క్​లు ఇచ్చారు. వాటిని చేస్తుండగా YLL668.COM వెబ్​సైట్​లో డిపాజిట్ చేసిన అమౌంట్​కు 30 శాతం ప్రాఫిట్​ ఇస్తామని సైబర్​నేరగాళ్లు మెసేజ్​పెట్టారు. 

దీంతో శ్యామలరావు ముందుగా రూ. వెయ్యి ఫోన్​పే చేయగా రూ. 1,300 రిటన్​ఇచ్చారు. అనంతరం రూ. 2 వేలు పెట్టగా.. రూ. 2600 వచ్చాయి. దీంతో నమ్మిన శ్యామలరావు ఈనెల17,18 తేదీల్లో పలుమార్లు రూ.1.72 లక్షలు ఫోన్​పే ద్వారా చెల్లించాడు. డబ్బును తీసుకొని సైబర్​నేరగాళ్లు రిటన్​చేయలేదు. దీంతో మోసపోయానని తెలుసుకుని బాధితుడు భువనగిరి రూరల్​పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.