ఇటీవల కాలంలో సైబర్ క్రైం నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మరీ ఎక్కువయ్యాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఏమాత్రం నిర్లిప్తంగా ఉన్నా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం తర్వాత స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూర్లతో ఆన్ లైన్ షాపింగ్, లావాదేవీలు, తదితర రోజువారి పనులన్నీ వ్యక్తి సంబంధించిన విలువైన డేటాతో సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. తాజాగా సైబర్ నేరగాళ్లు అధికారులు, పోలీసుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, ఆధునిక టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు.. ఇందుకు నిదర్శనమే ఈఘటన..హైదరాబాద్లో సైబర్ నేగాగాళ్ల చేతికి పోగొట్టుకున్న లక్షల రూపాయమలను రికవరీ చేసి బాధితుడి అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ALSO READ | గంటలో ఫిర్యాదు చేస్తే సైబర్ మోసాలకు చెక్ : కమిషనర్ సునీల్ దత్
హైదరాబాద్ సిటీలో సోమాజిగూడ ప్రాంతానికి చెందిన 39 యేళ్ల వ్యక్తికి ముంబైకి చెందిన క్రైం బ్రాంచి అధికారుల మని సైబర్ నేరగాళ్లు స్కైబ్ నెట్ వర్క్ ద్వారా ఫోన్ చేశారు. మీ పేరు ముంబై నుంచి తైవాన్ కు నకిలీ పాస్ పోర్టు, డ్రగ్స్ ఫెడిక్స్ కొరియర్ బుక్ చేయబడ్డాయి. ఇది చట్ట రీత్యా నేరం..మీకు శిక్ష తప్పదు అంటూ అతన్ని బెదిరించారు. అంతేకాదు బాధితుడు భయపడటంతో ఈ కేసునుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుడినుంచి మొత్తం రూ. 10 లక్షల 70 వేల రూపాయలు సైబర్ నేరగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. మోస పోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు. ఫ్రాడ్ స్టర్ల అకౌంట్లను ఫ్రీజ్ చేసి.. బాధితుడి డబ్బును రీకవరీ చేశారు. మొత్తం 9 లక్షల 30 వేల రూపాయలను తిరిగి బాధితుడి అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయించారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు కృతజ్ణతలు చెప్పాడు.
ఆన్ లైన్ లావాదేవీలు, ఇంటర్నెట్ వాడుతున్న వారు.. జాగ్రత్తగా కీలకమైన డేటా, మనీ కి సంబంధించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వినియోగించాలని కోరుతున్నారు. ఆన్ లైన్ ఫ్రాడ్ స్టర్లు ఉన్నారు బీకేర్ ఫుల్ అంటున్నారు సైబర్ క్రైం పోలీసులు.