
గద్వాల టౌన్, వెలుగు: సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకున్న పదిమందికి రూ.1,0 5,558 రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేసినట్లు సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సత్తయ్య, ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. సైబర్ క్రైమ్ కు గురై 1,36,585 రూపాయలు డబ్బులు పోగొట్టుకున్న అయిజ, ధరూర్, శాంతినగర్, రాజోలి, అలంపూర్, మల్దకల్, గద్వాల రూరల్ స్టేషన్ పరిధిలో బాధితులకు శనివారం గద్వాల జిల్లా డీఎల్ఎస్ఎ కోర్టు ద్వారా డిఫండ్ ఆర్డర్ కాపీలు అందించారు.
సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1900 కు లేదా, లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్, నందికర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.