నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ వాట్సప్ డీపీతో బుధవారం నకిలీ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. పలువురు అధికారులతో చాటింగ్ చేశారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్ దృష్టికి తేవడంతో సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
94782854487 నంబర్‌తో నకిలీ అకౌంట్ సృష్టించారని, ఈ నంబర్‌తో వచ్చే కాల్స్ వస్తే పోలీసులకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు.