
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కూతురు సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఫిర్యాదు అందింది. సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ లింకులను పంపుతున్నట్లు మహేశ్ బాబు టీమ్ (GMB) గుర్తించారు. అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఇదే విషయంపై మాదాపుర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేవలం సితార పేరుమీద అనే కాదు సెలబ్రిటీల పేరుతో వచ్చే లింకుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.
ఈ అంశంపై మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఫోటోలను వాడి కొందరు ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి ట్రేడింగ్, పెట్టుబడి లింక్‌లను పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటి విషయంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి, ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించండి.. అంటూ నోట్ లో రాసుకొచ్చారు నమ్రత. ఇక మహేష్ బాబు టీమ్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టారు సైబరాబాద్ పోలీసులు.