రూ.1.80లక్షలు కాజేసిన సైబర్​ నేరగాళ్లు

పెనుబల్లి, వెలుగు : ఫోన్​పే యాప్​కు లింక్​ పంపి సైబర్​ నేరగాళ్లు డబ్బులు కాజేశారు.  పెనుబల్లి మండలం వియం బంజర్​ గ్రామానికి చెందిన కొణిజేటి తిరుపతిస్వామి అనే వ్యాపారి మొబైల్​ కు సైబర్ నేరగాళ్లు మంగళవారం ఉదయం లింక్​ పంపారు. దాని గురించి అవగాహన లేని వ్యాపారి లింక్​ ఓపెన్​ చేయగా వెంటనే ఫోన్​పే హ్యాక్​ చేసి రూ.90వేల చొప్పున రెండు సార్లు రూ.1.80లక్షలు కాజేశారు. 

దీనిని గుర్తించిన అతడి కుమారుడు వెంటనే వియం బంజర్​ పోలీసులకు, బ్యాంక్​కు సమాచారం అందించారు.  దీంతో రూ. 90 వేల నగదును ఫ్రీజ్​ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్​ తెలిపారు.