వీడియో కాల్ చేసి బెదిరింపు.. 10.6లక్షలు కొట్టేసిన సైబర్​ చీటర్స్

వీడియో కాల్ చేసి బెదిరింపు.. 10.6లక్షలు కొట్టేసిన సైబర్​ చీటర్స్
  • పోలీసులను ఆశ్రయించిన వృద్ధుడు

బషీర్ బాగ్, వెలుగు: ఆధార్​కార్డుతో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి సిటీకి చెందిన వృద్ధుడి నుంచి సైబర్‌‌ నేరగాళ్లు రూ.10.68 లక్షలు కొట్టేశారు. సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం సిటీకి చెందిన వృద్ధుడు(76)కి ఇటీవల సైబర్​నేరగాడు వాట్సాప్​లో వీడియో కాల్​చేశాడు. లక్నోలోని ఆలంబాగ్‌‌ పోలీస్‌‌గా పరిచయం చేసుకున్నాడు. వృద్ధుడి ఆధార్‌‌ కార్డును తీసుకుని బ్యాంక్​అకౌంట్ క్రియేట్​చేశారు. తర్వాత అతడిని బెదిరించి ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ల నుంచి రూ.10లక్షల68వేలు ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. తర్వాత బాధితుడు లబోదిబోమంటూ సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులను ఆశ్రయించాడు. 

పార్ట్‌‌ టైం జాబ్‌‌ పేరుతో రూ.7.7లక్షలు

పార్ట్‌‌ టైం జాబ్‌‌ పేరుతో సిటీకి చెందిన ప్రైవేట్​ఉద్యోగి(34) నుంచి  సైబర్‌‌ చీటర్స్ రూ.7.70లక్షలు కొట్టేశారు. ముందుగా వాట్సాప్‌‌ లో సంప్రదించి, టెలిగ్రామ్‌‌ గ్రూప్‌‌లో జాయిన్​చేశారు. రోజూ ఇంటి నుంచే ఈజీగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. టాస్క్‌‌లు ఇస్తూ పూర్తి చేయాలని చెప్పారు. సెక్యూరిటీ డిపాజిట్‌‌ పేరుతో విడతల వారిగా రూ.7లక్షల70 వేలు కాజేశారు. చివరికి మోసపోయామని తెలుసుకున్న బాధితుడు సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.