అశ్వారావుపేట, వెలుగు: శాంతి, జల, జంతు, వన సంరక్షణ కోరుతూ కర్నాటకలోని రాయచూరు జిల్లా సింధునూరుకు చెందిన చాట్రారాజుల విజయ గోపాలకృష్ణ చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం అశ్వారావుపేటకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం రోడ్డులోని షిరిడి సాయిబాబా ఆలయంలో సేదదీరుతున్న ఆయనకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తోకల హరీశ్గుప్తా, కురిసెట్టి నాగబాబు నాయుడు దారి ఖర్చులకు నగదును అందజేశారు.
గతేడాది మార్చి11న సింధునూరులో ప్రారంభమైన సైకిల్ యాత్ర15 రాష్ట్రాల్లోని ఆలయాలను దర్శించుకొని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. కాశీ నుంచి రామేశ్వరం వరకు తన యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. తన సొంతూరు ఏపీలోని తణుకు మండలం కొమ్మవరమని, కర్ణాటకలో స్థిరపడినట్లు ఆయన తెలిపారు.