హైదరాబాద్లో సైకిల్ ట్రాక్ను తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్లో సైకిల్ ట్రాక్ను తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్ లో  సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను   నార్సింగ్ లో ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.  సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే  ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ దగ్గర  ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా   కొంతవరకు తీసేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

హైదరాబాద్  నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ని 2023 అక్టోబర్ 1న  మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.హెచ్ఎండీఏ నిర్మిచిన ఈ  సోలార్ సైకిల్ ట్రాక్  దేశంలో మొదటిది  కావడం విశేషం. నానక్ రామ్ గూడ నుంచి టీఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు ,  నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు మేర  మూడు లేన్ లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పు ట్రాక్, ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ,21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ తో పాటు... లైట్స్ ఏర్పాటు చేశారు.సైక్లిస్ట్ లకోసం పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 

23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ లో 21 కిలోమీటర్లు సోలార్ రూఫ్ టాప్.. మరో రెండు కిలోమీటర్లు నాన్ సోలార్ రూఫ్ టాప్  ఏర్పాటు చేశారు.దీని వల్ల 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఒక మెగావాట్ సోలార్ పవర్ ను సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగించనున్నారు, మిగతా 15 మెగావాట్ల విద్యుత్ ను  అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న విద్యుత్ దీపాలకు ఉపయోగించనుంది హెచ్ఎండీఏ.  ఈ ట్రాక్  24గంటలు  అందుబాటులో  ఉండనుంది.  ట్రాక్ చుట్టూ  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.