నిజామాబాద్‌సిటీ/ కామారెడ్డి టౌన్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒకరూ కృషి చేయాలని దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టిన రాబిన్‌సింగ్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా మూమెంట్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈటర జిల్లా శక్కర్‌నగర్ తాలుకాకు చెందిన రాబిన్‌సింగ్ సైకిల్‌యాత్ర చేపట్టారు. యూపీ నుంచి షురూ అయిన యాత్ర గురువారం కామారెడ్డి, నిజామాబాద్‌లకు చేరింది.
కామారెడ్డిలో ఆర్అండ్బీ గెస్ట్హౌజ్వద్ద రాబిన్సింగ్ను కామారెడ్డి డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ కలిశారు. ఇప్పటి వరకు తాను 2,700 కిలమీటర్లకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు రాబిన్ తెలిపారు.