శ్రీరాముడి దర్శనానికి సైకిల్ యాత్ర

తిర్యాణి, వెలుగు: అయోధ్యలో వెలసిన శ్రీరాముడి దర్శనానికి ఓ ఆదివాసీ యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. శ్రీరాముడి భక్తుడైన తిర్యాణి మండలం ఏదులపాడు గ్రామానికి చెందిన 23 ఏండ్ల ఆత్రం సచిన్ సోమవారం ఏదులపాడు నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు.

రామ జన్మభూమిలో బాల రాముడిని దర్శనం చేసుకొని తిరిగి వస్తానని తెలిపాడు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ రోజు ఈ యాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా లోకల్ సర్పంచ్ గోపాల్, గ్రామస్తులు సచిన్​కు రూ.10,016 అందజేశారు. జడ్పీటీసీ చంద్రశేఖర్, మండల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సచిన్​కు సెండ్​ఆప్ ఇచ్చారు.