తుఫానుతో పలు విమానాలు రద్దు

తుఫానుతో పలు విమానాలు రద్దు

ఏపీలో తుఫాను కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీ, చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన 3 విమానాలు రద్దు చేయగా..చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే 3విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. 

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 7విమానాలు రద్దు చేసిన ఎయిర్ లైన్స్ అధికారులు..బాంబే నుంచి 200 మంది ప్యాసింజర్లతో చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా నిలిపివేశారు. అంతేగాక..ఎయిర్ ఇండియా 429 ఢిల్లీ నుంచి చెన్నైకి 147 మంది ప్యాసింజర్లతో వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించారు.  తుఫాన్ కారణంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడులో పలు విమానాలు రద్దు చేశామని.. మరికొన్నింటిని దారి మళ్లించామని ఎయిర్ లైన్స్ అధికారులు పేర్కొన్నారు.