ఫెంగల్ తుఫాను: చెన్నైలో భారీ వర్షాలు.. విమానాశ్రయం తాత్కాలిక మూసివేత..

ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకపక్క ఈదురుగాలులు, మరో పక్క భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది.  ఈ క్రమంలో చెన్నై ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు. భారీ వర్షాల కారణంగా ఇవాళ ( నవంబర్ 30, 2024 ) సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

సేఫ్ ల్యాండింగ్ కోసం వచ్చే విమానాలు మినహాయించి.. అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని.. పలు విమాన సర్వీసులను ఇతర నగరాలకు మళ్ళించామని తెలిపారు అధికారులు. 
ఈ క్రమంలో చెన్నై నుంచి బయలుదేరే 30కి పైగా విమానాలు ఆలస్యం అవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

ALSO READ | ఫెంగల్ ఎఫెక్ట్: ఈదురుగాలుల బీభత్సం.. తిరుపతి ఎయిర్పోర్టులో 4 విమానాలు రద్దు

విమానాల ఆలస్యం గురించి సరైన సమాచారం లేకపోవటంతో చాలా మంది ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ఎయిర్పోర్టు అఫీషియల్ వెబ్‌సైట్ ప్రయాణీకులను ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించమని నిర్దేశిస్తుంది, కానీ కస్టమర్ సర్వీస్ లైన్‌లతో బిజీగా ఉండటం లేదా రెస్పాన్స్ లేకుండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.