ఏపీలో రానున్న మూడురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. వాయుగుండం గురువారం ( నవంబర్ 28, 2024 ) ఉదయం తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫానుకు ఫెంగల్ గా నామకరణం చేసింది వాతావరణ శాఖ. రెండురోజుల్లో తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని పేర్కొంది వాతావరణ శాఖ.
ఫెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గురువారం ( నవంబర్ 28, 2024 ) నుంచి శనివారం ( నవంబర్ 30, 2024 ) వరకు కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ .
Also Read:-రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు
శుక్రవారం ( నవంబర్ 29, 2024 ) వరకు తుపాను తీవ్రత ఉంటుందని.. ఈ క్రమంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.