బంగాళాఖాతంలో డిసెంబర్ 1న తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు

బంగాళాఖాతంలో డిసెంబర్ 1న తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు

బంగాళాఖాతంలో డిసెంబర్ 1న తుఫాన్ ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఈరోజు(నవంబర్ 28) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం(నవంబర్ 29) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని తెలిపింది. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రెండు రోజులు వాయువ్యంగా పయనించి వచ్చేనెల నవంబర్ ఒకటో తేదీకల్లా తుఫాన్‌గా బలపడనుంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని వచ్చే నవంబర్ 4వ తేదీకల్లా తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని.. 5వ తేదీకల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫాన్‌గా దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్‌ బలహీనపడుతుందని తెలిపింది. 

హైదరాబాద్ లో...

దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంలో నవంబర్ 28 వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబరు 1 వరకు ఉదయం వేళల్లో నగరం పాక్షికంగా మేఘావృతమైన ఆకాశంతో పాటు.. పొగమంచు వాతావరణంతో ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఈరోజు, రేపు(నవంబర్ 28, 29) తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో.. 

తెలంగాణలోని తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 1న ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంది.

ఏపీలో..

తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం(నవంబర్ 27) అల్పపీడనం ఏర్పడినట్లు చెబుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం(నవంబర్ 28) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.