శామీర్ పేటలో ఈదురుగాలుల బీభత్సం..చెట్టువిరిగిపడి బైకర్ మృతి

శామీర్ పేటలో ఈదురుగాలుల బీభత్సం..చెట్టువిరిగిపడి బైకర్ మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట్ వెళ్లే దారిలో చెట్టు విరిగి ఓ బైకర్ పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా ఈదురు గాలులతో వర్షం కురిసింది.ఆదివారం(మే 26) ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం..మధ్యాహ్నానికి ఒక్కసారి గా మారి పోయింది. మధ్యాహ్నం మేఘాలు కమ్మేసి వాతావరణ చల్లగా మారింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కర్మన్ ఘాట్, చంపాపేట, ఎల్బీ నగర్, నాగోల్, బంజారాహిల్స్ లలో వర్షం కురిసింది. మరోవైపు చైతన్యపురి, సైదాబద్ మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. 

వనస్థలిపురంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం సుష్మా చౌరస్తా వద్ద మన్సూరాబాద్ కు వెళ్లే మార్గంలో తెగిపడిన 11kv విధ్యుత్ వైరు తెగిపడింది. ఓ యువతికి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. 
కూలిన భారీ వృక్షం కూలింది. ఓ కారుపై పడటంతో పూర్తి ధ్వంస మైంది.. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. 

మరోవైపు ఘట్కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తో భారీ వర్షం.ఈ గాలివానకు ఘట్కేసర్ టు ఈసీఐఎల్ వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.