బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది భాతర వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సమీపంలో ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది. ఇది క్రమంగా బలపడి మే 9వ తేదీ అదివారం నాటికి వాయుగుండంగా మారనుందని స్పష్టం చేస్తోంది ఆ తర్వాత మరింత బలపడి తుఫాన్ గా మారుతుందని స్పష్టం చేస్తోంది వెదర్ రిపోర్ట్. వాయుగుండంగా మారిన తర్వాత దీని దిశ ఏ విధంగా ఉంటుంది.. ఎటు వైపు పయనిస్తుంది అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం అంటున్నారు అధికారులు. వాయుగుండంగా మారిన తర్వాత.. దాని వేగం, దిశ, తీవ్రత, ప్రయాణించే మార్గంపై స్పష్టత వస్తుందని.. దానికి మరో 24 గంటలు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని సైతం వెల్లడించారు అధికారులు. తుఫాన్ ఉత్తరం వైపు వెళితే మాత్రం.. తెలంగాణలోని తేమ అంతా అటు వైపు వెళ్లి.. ఎండలు మండిపోతాయని.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెబుతున్నారు అధికారులు. ఉత్తరం వైపు కాకుండా. .పశ్చిమ దిశ వైపు తుఫాన్ కదిలితే మాత్రంతెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడతాయని వెల్లడిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతానికి తెలంగాణలో రాబోయే వారం రోజులు మండే ఎండలు ఉంటాయా లేక భారీ వర్షాలు పడతాయా అనేది తుఫాన్ ఎటువైపు వెళుతుంది అనే దానిపైనే ఆధారపడి ఉంది.
ప్రస్తుతం అంటే మే 8వ తేదీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతారణం ఉండగా.. మరికొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.