బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుందని, మే 26న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని గురువారం భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ కు రెమల్ అని పేరు పెట్టారు. గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. మే 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర మరియు దక్షిణ మణిపూర్‌లోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.
రెమల్ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుంది. శనివారం ఉదయం తుఫానుగా మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుందని, మే 26న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావం ఆంధ్ర ప్రధేశ్ కోస్తా జిల్లాల్లో కూడా ఉండొచ్చు. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు మే27లోగా తీరానికి రావాలని, సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 102 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. భారీ వర్షాలు కురుస్తాయి. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.