ఇటీవలే భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఏపీకి మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.
ఈ తుపాన్ల ప్రభావంతో అక్టోబర్ 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.
Also Read :- సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీతం పెంచాలి
ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. మరోవైపు అక్టోబర్ లో మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.