
రంగారెడ్డి: రాజేంద్రనగర్లో హైదర్గూడ కంట్రీ చికెన్ సెంటర్లో పేలుడు సంభవించింది. తెల్లవారుజామున షాపులో సిలిండర్ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చికెన్ సెంటర్లో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే సిలిండర్ బ్లాస్ట్ను కప్పి పుచ్చేందుకు షాపు నిర్వాహకులు ప్రయత్నించారు. కవరేజ్కు వెళ్లిన మీడియాపై దాడికి యత్నం చేశారు.