- మణుగూరు మండలంలో ప్రమాదం
మణుగూరు, వెలుగు : కారులో ప్రయాణిస్తుండగా అందులోని సిలిండర్ లీకై అగ్నిప్రమాదం జరగడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మణుగూరు మండలం పీవీ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు రామ్మోహన్ రావు, జోష్నారాణి దంపతులు కారులో బజారు నుంచి ఇంటికి వెళ్తుండగా ముత్యాలమ్మ నగర్ సమీపంలో కారుకు అమర్చిచన గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి.
స్థానికులు అప్రమత్తమై వారిద్దరిని బయటకు లాగి మంటలు ఆర్పివేశారు. ఆ లోపే రామ్మోహన్ రావు, జోష్నారాణి దంపతులకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట సింగరేణి ఏరియా హాస్పిటల్కు, అక్కడి నుంచి కొత్తగూడెం సింగరేణి హాస్పిటల్కు తరలించారు.