టాటా సన్స్ ఛైర్మన్ గా మళ్లీ సైరన్ మిస్త్రీనే?

టాటా సన్స్ ఛైర్మన్ గా మళ్లీ సైరన్ మిస్త్రీనే?

న్యూఢిల్లీ టాటా గ్రూప్–సైరస్ మిస్త్రీ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్‌‌సీలాట్‌‌లో సైరస్ మిస్త్రీ విజయం సాధించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా సైరస్‌‌ మిస్త్రీని తొలగించడం సరికాదని, ఆయన్ను మళ్లీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా నియమించాలని ఎన్‌‌సీలాట్ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్‌‌ ముఖోపాధ్యాయతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ మిస్త్రీకి అనుకూలంగా బుధవారం తీర్పు చెప్పింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌‌వేర్ వరకు వ్యాపారాలున్న ఈ కంపెనీకి ప్రస్తుతం హెడ్‌‌గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ అపాయింట్‌‌మెంట్‌‌ చట్టవిరుద్ధమని ఎన్‌‌సీలాట్ తేల్చింది. ఈ తీర్పు మీద టాటాలు అప్పీలుకు వెళ్లేందుకు నాలుగు వారాల సమయమిస్తున్నట్టు ఎన్‌‌సీలాట్ చెప్పింది. టాటా గ్రూప్‌‌ ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ కంపెనీగా మారినట్టు కింద కోర్టులు ఇచ్చిన తీర్పును నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్(ఎన్‌‌సీలాట్) కొట్టివేసింది.

కార్పొరేట్ రంగంలోనే కలకలం….

షాపూర్జీ పల్లోంజి ఫ్యామిలీకి చెందిన సైరస్ మిస్త్రీని 2016 అక్టోబర్‌‌‌‌లో టాటా సన్స్ ఛైర్మన్‌‌గా అర్థాంతరంగా తొలగించారు. ఆ తర్వాత టాటా సన్స్ బోర్డు డైరెక్టర్‌‌‌‌గా కూడా తీసేశారు.  అప్పట్లో సైరస్ మిస్త్రీ వివాదం కార్పొరేట్ రంగంలోనే కలకలం రేపింది. ఒక  ఛైర్మన్​ను అలా చెప్పాపెట్టకుండా తొలగించడం అదే మొదటిసారి. టాటా సన్స్‌‌కు సైరస్‌‌ మిస్త్రీ ఆరో ఛైర్మన్. రతన్ టాటా తర్వాత 2012లో సైరస్ మిస్త్రీ ఈ బాధ్యతలు చేపట్టారు. కానీ లాభాపేక్ష లేని వ్యాపారాలపై దృష్టిపెట్టకపోవడం, వాటిని వదిలించుకునేందుకు పలు విక్రయాలు జరపడం చేశారని మిస్త్రీపై టాటాలు వేటు వేశారు. ఈ విషయంలో టాటాలపై సైరస్ మిస్త్రీ బహిరంగంగా పలు కామెంట్లు చేశారు.  టాటా సన్స్‌‌లో మిస్త్రీ ఫ్యామిలీకి 18.4 శాతం వాటాలున్నాయి.

10 శాతం షేర్‌‌‌‌హోల్డింగ్ రిక్వైర్‌‌‌‌మెంట్ పక్కకి…

ఈయన తన తొలగింపును నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌‌సీఎల్‌‌టీ)లో సవాలు చేశారు. సైరస్ మిస్త్రీకి చెందిన సంస్థలు సైరస్ ఇన్వెస్ట్‌‌మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌‌లో రతన్ టాటా, టాటా సన్స్‌‌, మరో 20 మందిపై మిస్‌‌మేనేజ్‌‌మెంట్ ఆరోపణలు చేశారు. అయితే ఈ పిటిషన్‌‌ను ఎన్‌‌సీఎల్‌‌టీ 2017లో కొట్టివేసింది. 2013 కంపెనీస్ యాక్ట్‌‌ సెక్షన్ 244 ప్రకారం, ఏదేనీ సంస్థపై వ్యతిరేకంగా మిస్‌‌మేనేజ్‌‌మెంట్‌‌ కేసు దాఖలు చేయాలంటే.. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌‌లో పదోవంతు తక్కువ కాకుండా ఆ సంస్థలో వారికి షేర్‌‌‌‌హోల్డింగ్ ఉండాలి. కానీ, ఈ 10 శాతం షేర్‌‌‌‌హోల్డింగ్‌‌ రిక్వైర్‌‌‌‌మెంట్‌‌ను పక్కన పెట్టిన ఎన్‌‌సీలాట్‌‌ ఈ విషయంపై మళ్లీ విచారించాల్సిందిగా ఎన్‌‌సీఎల్‌‌టీకి పంపించింది. గతేడాది జూలైలో ఎన్‌‌సీఎల్‌‌టీ మిస్త్రీ పిటిషన్‌‌ మళ్లీ కొట్టివేసింది. ఆపరేషనల్ మిస్‌‌మేనేజ్‌‌మెంట్, మైనార్టీ షేర్‌‌‌‌హోల్డర్స్‌‌ అణచివేతకు గురవుతున్నారంటూ మిస్త్రీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌‌సీఎల్‌‌టీ మళ్లీ తీర్పిచ్చింది. ముంబై ఎన్‌‌సీఎల్‌‌టీ తీర్పుకు వ్యతిరేకంగా మిస్త్రీ అప్పీలెట్ ట్రైబ్యునల్‌‌కు వెళ్లారు. జస్టిస్ ఎస్‌‌ ముఖోపాధ్యాయతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ మిస్త్రీకి అనుకూలంగా బుధవారం తీర్పు చెప్పింది.

రస్ మిస్త్రీకి అనుకూలంగా ఎన్‌‌సీలాట్ ఇచ్చిన జడ్జిమెంట్‌‌పై వ్యతిరేకంగా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. లిస్టెడ్ గ్రూప్ కంపెనీల షేర్‌‌‌‌హోల్డర్స్ మీటింగ్స్‌‌లో వాటాదారులు తీసుకున్న నిర్ణయాలను ఎన్‌‌సీలాట్ ఎలా తోసిపుచ్చుతుందో అర్థం కాలేదు…..

– ఎన్‌‌సీలాట్ తీర్పుపై టాటా సన్స్ రియాక్షన్

ఎన్‌‌సీలాట్ తీర్పు గుడ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్‌‌కు, మైనార్టీ షేర్‌‌‌‌ హోల్డర్స్‌‌కు దక్కిన విజయం. టాటా గ్రూప్‌‌ను అభివృద్ధి చేయాలి. ఈ ఇన్‌‌స్టిట్యూషన్ మనమందరం ఎంతో ఆదరించే సంస్థ. దేశం మొత్తం గర్వించదగ్గ రీతిలో ఈ ఇన్‌‌స్టిట్యూషన్‌‌కు బాధ్యతా యుతమైన గార్డియన్‌‌గా సేవలందించా…..

– సైరస్ మిస్త్రీ, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్