న్యూయార్క్ : చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ముచోవా.. యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో అన్‌సీడెడ్ ముచోవా 6–1, 6–4తో బిట్రిజ్ హడాడ్ మయ (బ్రెజిల్)పై గెలిచింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో రెండోసీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6–1, 6–2తో క్విన్‌వెన్ జెంగ్ (చైనా)పై, ఎమ్మా నవారో (అమెరికా) 6–2, 7–5తో పౌలా బడోసా (స్పెయిన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.
మెన్స్ క్వార్టర్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై, ఫ్రాన్సిస్ తియాఫో (అమెరికా) 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గారు. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో రోహన్ బోపన్న (ఇండియా)–అల్డిలా సూట్జియాది (ఇండోనేసియా) 3–6, 4–6తో టౌన్సెండ్–యంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.