చిగురుమామిడికి గౌరవెల్లి నీళ్లు

 చిగురుమామిడికి గౌరవెల్లి నీళ్లు
  • సైదాపూర్ మండలం రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీ-5 కెనాల్ విస్తరణ 
  •  16 వేల ఎకరాలకు సాగునీరే అందించడమే లక్ష్యం 
  •  కాలువల నిర్మాణం కోసం 300 ఎకరాల భూసేకరణ
  •  మంత్రి పొన్నం చొరవతో స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనులు 


కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు ఒకటి, రెండేళ్లలో గౌరవెల్లి జలాలు రానున్నాయి. బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈ రెండు మండలాల్లో 16 వేల ఎకరాలకు సాగు నీరందించేలా కెనాల్స్, సబ్ కెనాల్స్ నిర్మాణానికి ప్రభుత్వం 265 ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం చేసింది. 

ఇప్పటికే గ్రామసభలు పూర్తి చేసిన అధికారులు.. రైతులకు న్యాయపరమైన పరిహారం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  డిస్ట్రిబ్యూటరీ కెనాల్–4 చిగురుమామిడి మండలంలోని తొమ్మిది గ్రామాల మీదుగా వెళ్లనుంది. సైదాపూర్ మండలం రాయికల్, ఆకునూరు పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్– 5  విస్తరణకు అధికారులు భూమి సేకరిస్తున్నారు. 

 కాల్వల నిర్మాణంపై నిర్లక్ష్యం

గౌరవెల్లి ప్రాజెక్టుకు 2007లో నాటీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించకుండా ఆందోళనల మధ్యనే గౌరవెల్లి ప్రాజెక్టును బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసింది. కానీ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుబంధంగా కెనాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించడంలో నిర్లక్ష్యం చేసింది. డీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 4 కెనాల్ కింద సబ్ కెనాల్స్ నిర్మాణం కోసం చిగురుమామిడి మండలంలోని 9 గ్రామాల్లో 300 ఎకరాలు సేకరించాలని 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17లోనే అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కేవలం 35 ఎకరాలు మాత్రమే సేకరించి వదిలేసింది.

 ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. కెనాల్ తవ్వకాల కోసం సర్వేలు, గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో డిస్ట్రిబ్యూటరీ-4 కింద మైనర్, సబ్ మైనర్ కెనాల్స్ అన్నీ కలిపి 61 కిలోమీటర్ల మేర తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్వ, బండ్ కలిపి మెయిన్ కెనాల్ 50 మీటర్ల వెడల్పుతో,  మైనర్ కెనాల్ ను కాల్వ, బండ్ కలిపి 28 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. కాల్వ కొండపూర్ లోని 16.86 కి.మీ వద్ద మొదలై ఇందుర్తి గ్రామంలోని 26.5 కి.మీ. వద్ద ముగియనుంది. 

16 వేల ఎకరాలకు సాగునీరు

ఈ కెనాల్ నిర్మాణం ద్వారా చిగురుమామడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి,  ఇందుర్తి, బొమ్మనపల్లి, నవాబుపేట్, కొండాపూర్, గాగిరెడ్డిపల్లి, లంబాడిపల్లి, ఉల్లంపల్లి గ్రామాలకు సాగునీరందనుంది. కెనాల్స్ పూర్తయి తమకు నీరందితే సాగుకు ఢోకా ఉండదని రైతులు సంతోషంతో ఉన్నారు. అందుకే గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు పూర్తిస్థాయిలో సహకరిస్తూ స్వాగతించారు. 

గౌరవెల్లిని మేమే ప్రారంభించాం.. మేమే పూర్తి చేస్తాం

గౌరవెల్లి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించింది. ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించినప్పుడే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరినట్లు. కానీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఈ పని జరగలేదు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరందించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నా. భూసేకరణ పూర్తి కావడానికి వచ్చింది. వచ్చే ఏడాది యాసంగి నాటికి కాల్వల ద్వారా నీళ్లందిస్తాం. - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి