సిద్దిపేట సీపీగా బాధ్యతలు చేపట్టిన అనురాధ

సిద్దిపేట సీపీగా  బాధ్యతలు చేపట్టిన అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బి. అనురాధ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనరేట్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆమె, అడిషనల్ డీసీపీలు, ఏసీపీ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ టి. రఘురామ్ లను మర్యాదపూర్వకంగా కలసి మొక్కలను అందజేశారు. అంతకు ముందు ఆమెకు అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి,  ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు స్వాగతం పలికారు.