సింగపూర్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా.. ఇండియా గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్.. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య గురువారం జరిగిన 9వ రౌండ్ గేమ్ కూడా డ్రా అయ్యింది. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ 54 ఎత్తుల వద్ద ముగిసింది. ఓవరాల్‌గా ఇది వరుసగా ఆరో డ్రా కావడం విశేషం. ఇద్దరు ప్లేయర్లు పాయింట్‌ను పంచుకోగా, ఈ రౌండ్ తర్వాత ఇద్దరి ఖాతాలో చెరో నాలుగున్నర పాయింట్లు ఉన్నాయి.
మరో ఐదు గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్న ఈ టోర్నీలో చాంపియన్‌షిప్ గెలవాలంటే ఇంకా మూడు పాయింట్లు అవసరం. తెల్లపావులతో ఆడిన గుకేశ్ కెటలాన్ ఓపెనింగ్‌తో లిరెన్ సహనాన్ని పరీక్షించాడు. 14వ ఎత్తు వద్ద గేమ్‌ను మలుపు తిప్పిన ఇండియన్ ప్లేయర్ ఆ జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. 20వ ఎత్తు వద్ద ఒత్తిడిని పెంచడంలో ఫెయిలయ్యాడు. 23వ ఎత్తు నుంచి పుంజుకున్న లిరెన్ గేమ్‌ను క్రమంగా డ్రావైపు తీసుకెళ్లాడు.