గుకేశ్‌‌ చేజారిన గెలుపు..లిరెన్‌‌తో ఏడో గేమ్‌ డ్రా

గుకేశ్‌‌ చేజారిన గెలుపు..లిరెన్‌‌తో ఏడో గేమ్‌ డ్రా

సింగపూర్‌‌‌‌ : డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డింగ్‌‌‌‌ లిరెన్‌‌‌‌తో వరల్డ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ మ్యాచ్​లో  ఆధిక్యం సాధించే అవకాశాన్ని ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్‌ కోల్పోయాడు. మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్‌ విజయాన్ని చేజార్చుకున్నాడు. ఈ గేమ్ 72 ఎత్తుల వద్ద డ్రా అవ్వగా..  ఇద్దరు ప్లేయర్లు చెరో మూడున్నర పాయింట్లతో సమంగా నిలిచారు. 5 గంటలా 22 నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్‌‌‌‌లో ఓ దశలో లిరెన్‌‌‌‌ను గుకేశ్ ఓటమి అంచుల్లో నిలిపాడు.

 కానీ ఎండ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో అతను అనూహ్యంగా తడబడ్డాడు. సాధారణ ఎత్తులతో ముగియాల్సిన గేమ్‌‌‌‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళ్లాడు. 40వ ఎత్తుల వరకు గుకేశ్‌‌‌‌ ఆధిపత్యం కొనసాగినా 45వ ఎత్తు వద్ద చేసిన తప్పిదం గేమ్‌‌‌‌ను మలుపు తిప్పింది. లిరెన్‌‌‌‌ పుంజుకుని డ్రా వైపు మళ్లించాడు. 14 రౌండ్ల ఈ టోర్నీలో 8వ రౌండ్‌ బుధవారం జరుగుతుంది.