సింగపూర్ : వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరులో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ నల్లపావులతో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను మరోసారి నిలువరించాడు. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ డ్రాగా ముగిసింది. 14 రౌండ్ల పోటీలో లిరెన్, గుకేశ్ ప్రస్తుతం చెరో మూడు పాయింట్లతో సమానంగా నిలిచారు.
హోరాహోరీగా సాగిన ఆరో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లిరెన్ ఆరంభంలో బలమైన లండన్ సిస్టమ్‌తో సత్తా చాటాడు. కానీ, 20 ఎత్తుల తర్వాత గుకేశ్ పుంజుకొని గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు 46 ఎత్తుల వద్ద ఇద్దరు ప్లేయర్లు డ్రాకు అంగీకరించి పాయింట్ పంచుకున్నారు. ఇద్దరి మధ్య ఏడో రౌండ్ మంగళవారం జరుగుతుంది.