లాక్‌డౌన్ దెబ్బకు తగ్గిన డీ-మార్ట్ ఆదాయం

లాక్‌డౌన్‌లో డీ–మార్ట్​ రెవెన్యూ 45 శాతం తగ్గింది

న్యూఢిల్లీ: లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైములో ఏప్రిల్‌‌‌‌ నెలలో రెవెన్యూ 45 శాతం తగ్గిపోయినట్లు డీ–మార్ట్‌‌‌‌ రిటైల్‌‌‌‌ చెయిన్‌‌‌‌ నిర్వహించే ఎవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌‌‌ ప్రకటించింది. దాదాపు సగానికి పైగా స్టోర్లు తెరుచుకోలేదని తెలిపింది. నిత్యావసర వస్తువులు తప్ప ఇతర ఉత్పత్తులేవీ అమ్మకపోవడంతో మార్జిన్స్‌‌‌‌ కూడా తగ్గాయని పేర్కొంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ 4 లోనూ కొన్ని నియంత్రణలు కొనసాగుతున్నాయని, దీంతో స్టోర్లకు వచ్చే వాళ్లు తగ్గి, ఫలితంగా అమ్మకాలూ తగ్గుతున్నాయని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌‌‌‌ నెలలో తమ ఉద్యోగులలో 70 శాతం మంది విధులకు హాజరు కాలేదని కూడా పేర్కొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వెల్లడించింది. కొన్ని పరిమితులను ప్రభుత్వం తొలగించడంతో మే నెలలో కొంత మార్పు కనిపిస్తోందని, గత నెలలో కంటే ఎక్కువ స్టోర్లను ఇప్పుడు ఆపరేట్‌‌‌‌ చేయగలుగుతున్నామని కూడా ఎవెన్యూ సూపర్‌‌‌‌ మార్ట్స్‌‌‌‌ తెలిపింది. దీంతో మే నెల మొదటి 14 రోజులలో ఏప్రిల్‌‌‌‌తో పోలిస్తే రెవెన్యూ 17 శాతం పెరిగిందని వివరించింది. మాన్యుఫాక్చరర్లు కూడా ఫ్యాక్టరీలు తెరవడంతోపాటు సరకు రవాణా వాహనాలను లోకల్‌‌‌‌ అథారిటీస్‌‌‌‌ అనుమతిస్తుండటంతో సప్లై చెయిన్ కొంత మెరుగుపడిందని పేర్కొంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ 4 లో నిత్యావసరాలు కాని వాటిని కూడా అమ్ముతున్నామని, అమ్మకాలలో వాటి వాటా 35 శాతం దాకా ఉంటుందని తెలిపింది. జనవరి–మార్చి క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ 23 శాతం మాత్రమే పెరిగి రూ. 6,194 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది. సోషల్‌‌‌‌ డిస్టెన్సింగ్‌‌‌‌, కన్స్యూమర్ల ఎంపికలలో మార్పులను నిశితంగానే పరిశీలించాల్సి ఉంటుందని ఎవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌‌‌ అభిప్రాయపడుతోంది. కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ యాక్టివిటీ నెమ్మదించడంతో కొత్త స్టోర్ల ప్రారంభం ఆలస్యం కావచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 214 డీ–మార్ట్‌‌‌‌ స్టోర్లను కంపెనీ నడుపుతోంది.

For More News..

కాటన్ సీడ్స్‌లో పాలిటిక్స్

విండీస్‌లో మొదలైన క్రికెట్​

మాస్క్​ అవసరం కాదు.. అలవాటైపోయింది