డీ-మార్ట్ క్యూ1 ఆదాయం రూ. 13,712 కోట్లు

డీ-మార్ట్ క్యూ1 ఆదాయం రూ. 13,712 కోట్లు

న్యూఢిల్లీ:  రిటైల్ చైన్ డీ-మార్ట్‌‌‌‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ లిమిటెడ్​కు జూన్​ క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా స్టాండ్‌‌‌‌లోన్ పద్ధతిలో రాబడి 18.36 శాతం పెరిగి రూ. 13,711.87 కోట్లకు చేరుకుంది.   గత ఏడాది కాలంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ. 11,584.44 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలియజేసింది.   

జూన్ 30 నాటికి మొత్తం దుకాణాల సంఖ్య 371కు చేరింది. ఇందులో గుజరాత్‌‌‌‌లోని రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లోని ఒక స్టోర్ కూడా ఉంది.  2023 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్  స్టాండ్‌‌‌‌లోన్ ఆదాయం రూ.9,806.89 కోట్లుగా ఉంది.   డిమార్ట్​కు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌‌‌‌గఢ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో స్టోర్లు ఉన్నాయి.