పటోలా మేళా..భళా!

హైదరాబాద్​సిటీ, వెలుగు : బంజారాహిల్స్‌‌‌‌ రోడ్ నంబర్–1లోని లేబుల్స్ పాప్-అప్ స్పేస్ లో ఏర్పాటు చేసిన ‘డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన’ ఆకట్టుకుంటోంది. వెడ్డింగ్ స్పెషల్​కలెక్షన్స్ కట్టిపడేస్తున్నాయి. రాజ్‌‌‌‌కోట , పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్ పటాన్ చీరలు, సింగిల్ పటోలా దుపట్టా, పటాన్ పటోలా చీరలు, సిల్క్ టిష్యూ పటోలా వంటి 10 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.

విభిన్నమైన హ్యండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ నెల 16 వరకు ఎగ్జిబిషన్​కొనసాగుతుందని డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మక్వానా తెలిపారు. నేత కార్మికులను ప్రోత్సహించడం, చేనేత పరిశ్రమకు మార్కెట్‌‌‌‌ను అందించడమే ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యం అన్నారు.