- డీఎస్ తనయుడు సంజయ్ ఇంటిపై దాడి
- కారుతో గేటును గుద్దిన రౌడీషీటర్, మరో ఇద్దరు
- దాడి చేసినోళ్లు తెలుసు.. పోలీసులకు ఫిర్యాదు చేయను : ధర్మపురి సంజయ్
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పెద్ద కొడుకు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం దాడి జరిగింది. ఈ ఘటనలో రౌడీ షీటర్ సందీప్ వర్మ అలియాస్ చోర్బబ్లూతో పాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో సంజయ్ ఉంటున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు కారులో వచ్చిన సందీప్..మరో ఇద్దరు సంజయ్ ఇంటి మెయిన్ గేటును గుద్ది లోపలకు వెళ్లేందుకు యత్నించారు. గేటు వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడి చేశారు.
విషయాన్ని ఫోన్లో సంజయ్‌కు చెప్పి 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. అయితే, పోలీసులు వచ్చేలోపు దుండగులు వెళ్లిపోయారు. ఈ దాడిపై సంజయ్ మాట్లాడుతూ సందీప్‌వర్మ తనకు తెలుసునని ఆయన ఆధ్వర్యంలో నడిచిన రియల్ఎస్టేట్ ఆఫీసును తానే ప్రారంభించానన్నారు. ఎందుకు దాడి చేశారో తనకు తెలియదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయదలుచుకోలేదన్నారు.