సర్కార్ ఉద్యోగులకు డీఏ

అగ్రికల్చర్​లో రెండు కొత్త డిపార్ట్ మెంట్లు

సర్కార్ దగ్గర ఎన్ని పైసలున్నయో లెక్క తేల్చండి

గ్రేటర్​లో పండుగకు ముందే ఆర్థికసాయం అందివ్వాలి

పలు డిపార్టుమెంట్లపై సీఎం కేసీఆర్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: సర్కార్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏల్లో ఒక డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. 2019 జులై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారు.  5.24 శాతం డీఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. దీంతో డీఏ 33.576 శాతం నుంచి 38.776 శాతానికి చేరిందని అందులో పేర్కొంది. ఈ డీఏను డిసెంబర్ 1న వచ్చే నవంబర్ వేతనంతో రానుంది.  ఈనెల1 వరకు మొత్తం16 నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు ట్రాన్ఫఫర్ చేయనున్నట్లు సమాచారం. ఈ డీఏ బకాయిల మొత్తం రూ.1,500 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ వివిధ డిపార్ట్​మెంట్లపై రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

వ్యవసాయ శాఖలో మరో రెండు కొత్త విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. కొత్త డిపార్ట్ మెంట్లకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. కొత్తగా వ్యవసాయశాఖ లో ఏర్పాటు చేసే రెండు విభాగాల్లో ఒక విభాగం సాగునీరు, కరెంటు, ఎరువులు, విత్తనాలు అగ్రి ఇన్​ఫ్రా ఫెసిలిటీస్ పర్యవేక్షించాలన్నారు. మరో విభాగం మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలని, ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది ఏ పంటవేస్తే రైతులకు లాభమో స్టడీ చేయాలన్నారు.

ఏయే శాఖలకు ఎన్ని పైసలియ్యొచ్చు?

కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ తగ్గాయని.. 2020––21 బడ్జెట్ పై మధ్యంతర రివ్యూ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సర్కార్ వద్ద వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలని సూచించారు. ఏయే శాఖలకు ఎన్ని ఫండ్స్ విడుదల చేసేందుకు అవకాశం ఉందో పరిశీలించి రిపోర్టు ఇవావలని ఆఫీసర్లను ఆదేశించారు.

సీఎంఆర్​ఎఫ్​కు ఉద్యోగ జేఏసీ ఒకరోజు వేతనం

వరద బాధితులకు సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.33 కోట్లకు సంబంధించిన కన్సెంట్ లెటర్​ను ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు అందించారు. తరువాత వారు మాట్లాడుతూ టీఎన్జీవో, టీజీవో, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, డ్రైవర్లు సంఘాల వారే ఒకరోజు జీతాన్ని ఇవ్వడానికి అంగీకరించారన్నారు. టీచర్లు, పెన్షనర్లు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై 18 డిమాండ్లతో వినతి పత్రాన్ని సీఎంకు ఇచ్చామన్నారు. స్పందించి సీఎం త్వరలో ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి అన్ని అంశాలను చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

For More News..

మక్కలు మళ్లీ కొనేది లేదు.. ఇదే చివరిసారి..