కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు క్యాబినేట్ మీటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లను నాలుగు శాతం పెంచింది. ప్రస్తుతం 46శాతంగా ఉన్న డియర్ నెస్ అలవెన్స్ లను 50 శాతంగా ప్రకటించింది. 7వ  కేంద్ర వేతన సంఘం సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ 49లక్షల మంది, 68మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. జనవరి 1నుంచి జూన్ 30, 2024 వరకు పెంచారు. 

ALSO READ :- గుడ్ న్యూస్: ఉజ్వల గ్యాస్ సబ్సిడీ పథకం.. మార్చి 25 వరకు పొడిగింపు..