Daaku Maharaaj Box Office: డాకు మహారాజ్ ఐదో రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఐదు రోజులలో రూ.114 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది.

లేటెస్ట్ గా జనవరి 17న డాకు మహారాజ్ బాక్సాఫీస్ రిపోర్ట్ వెల్లడించారు మేకర్స్. " డాకు మహారాజ్ ఐదు రోజులలో రూ.114 కోట్ల గ్రాస్ వసూళ్లతో నిలువరించలేని విధ్వంసం సృష్టిస్తున్నాడు" అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ALSO READ | DaakuMaharaaj: వంద కోట్ల క్లబ్‌లో డాకు మహారాజ్.. బాలయ్య కెరీర్లో ఫాస్టెస్ట్ మూవీగా సరికొత్త రికార్డ్

అయితే, నాలుగో రోజున బుధవారం 20.41 శాతం తగ్గుదలతో 9.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన డాకు మహారాజ్ సినిమా ఐదో రోజున ఇండియాలో రూ.6.25 కోట్లు రాబట్టినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. ఇకపోతే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.66.4 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 

డాకు మహారాజ్ నార్త్ అమెరికా బాక్సాఫీస్:

డాకు మహారాజ్ రిలీజైన మూడు రోజుల్లోనే ఉత్తర అమెరికాలో (USA మరియు కెనడా) బాక్సాఫీస్ ధమాఖా చూపించింది. $735K వసూలు చేయడం ద్వారా బాలయ్య కెరీర్-బెస్ట్ ప్రీమియర్‌లను నమోదు చేసింది. ఇది బాలయ్య గత చిత్రం వీర సింహ రెడ్డి $708K ని అధిగమించింది.

అయితే, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ కావడంతో డాకు మహారాజ్ కలెక్షన్స్ లో వేగం తగ్గింది. లేటెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్ అప్‌డేట్ ప్రకారం.. డాకు మహారాజ్ మూవీ నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లో $1.28 మిలియన్లు వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.11.08 కోట్లకు సమానం.