బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మోడల్ ఊర్వశి రౌటేలా ఈ మధ్య సౌత్ లో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఇటీవలే తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలాగే స్పెషల్ సాంగ్ లో నటించి అలరించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వూలో ఊర్వశి రౌటేలా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇందులో ఊర్వశి కియారా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యిందని, తాను నటించిన డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని కామెంట్లు చేసింది. అలాగే డిజాస్టర్ వచ్చినప్పుడు పెయిడ్ పీఆర్ లు కూడా ఏమీ చెయ్యలేరని స్టోరీ చేసింది. మరోవైపు సైఫ్ అలీఖాన్ పై దాడి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ధరించిన ఖరీదైన వస్తువులను చూపిస్తూ ఇండస్ట్రీలో ఇలాంటి దాడులు జరగటం వలన ధైర్యంగా కాస్ట్ లీ వస్తువులు ధరించి తిరగలేకపోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కొందరు నెటిజన్లు ఊర్వశిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :- మళ్ళీ కొత్త ప్రయోగం చేయనున్న వరుణ్ తేజ్
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి తెలుగులో నూతన డైరెక్టర్ మోహన్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్న బ్లాక్ రోజ్ అనే సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్ట్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
TF! She literally said, "Game Changer is a DISASTER," openly 😭😂🤣 pic.twitter.com/S2v51THqSk
— BFilmy Official (@BFilmyOfficial_) January 18, 2025