Daaku Maharaaj: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. క్రిటిక్ ఉమైర్ సంధు ఎలా చెప్పాడో చూడండి

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి రూపొందించిన చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రేపు జనవరి12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణకు అచ్చోచ్చే తన సంక్రాంతి విజయ పరంపరను రిపీట్ చేయడంలో బిజీ ఉన్నాడు.

అయితే, డాకు మహారాజ్ సినిమా రిలీజ్ ముందురోజే రివ్యూ ఇచ్చేసాడు ఓ సినీ క్రిటిక్. అతనెవరో కాదండోయ్.. సౌత్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకుంటూ కాంట్రవర్సియల్ ట్వీట్స్ చేసే ఉమైర్ సంధు (Umair Sandhu) డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు.

" డాకు మహారాజ్ సినిమాలో హీరో బాలకృష్ణ, విలన్ బాబీడియోల్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఊర్వశిరౌతెలా సెక్సీ ఐటెం సాంగ్ అద్దిరిపోయింది. సిటీ మార్ డైలాగ్స్ & క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన పైసా వసూల్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నప్పటికీ ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్" అని రాసుకొచ్చాడు ఉమైర్ సంధు. అంతేకాకుండా సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.!

Also Read :- గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ

ప్రస్తుతం ఉమైర్ సంధు రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటికీ మొన్న ఉమైర్ సంధు తనదైన శైలిలో గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చి వార్తల్లో ఎక్కాడు. అతను ఇచ్చిన రివ్యూ పూర్తి నెగిటివ్ గా ఉండటంతో మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్.