Daaku Maharaaj: బిగ్ షాక్.. ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ HD వెర్షన్ లీక్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే పైరసీ ఏందీ సామి!

Daaku Maharaaj: బిగ్ షాక్.. ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ HD వెర్షన్ లీక్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే పైరసీ ఏందీ సామి!

డాకు మహారాజ్(Daaku Maharaaj) ఓటీటీలో HD వెర్షన్ లీకైంది. ఈ సినిమా ఓటీటీ రాకముందే.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో దర్శనమిచ్చింది. అదేలా అంటే, ప్రస్తుతం ఓటీటీలో డౌన్ లోడ్ చేసుకునే సినిమాల మాదిరి HD క్వాలిటీతో వచ్చింది. ఇదొక రకంగా సినిమా మేకర్స్ కి, డాకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఓటీటీ  ప్లాట్ ఫామ్ కు గట్టి దెబ్బె పడిందని చెప్పాలి. HD వెర్షన్ తో ఆడియో కూడా ఆన్‌లైన్‌లో లీక్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లకు పైగా వెచ్చించిందని సమాచారం. దీంతో డాకు మహారాజ్ ఓటీటీ అనౌన్స్ రాకముందే.. ఇలా లీకులతో సినిమా చూపిస్తే నష్టం ఎలా ఉంటుందో ఉహించుకోండి. థియేటర్స్ సినిమా రిలీజ్ అవ్వగానే నార్మల్ క్వాలిటీ తో వచ్చింది. అయిన, సైబర్ నేరస్థుల నుంచి లీకుల పర్వం ఆగట్లేదు. 

పైరసీ ఎక్కడ అవుతుంది?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్నేళ్లుగా పైరసీతో పోరాడుతోంది. ఇది 2025 డిజిటల్ కాలం. కానీ, టెక్నాలజీ అనేది ఎన్నో ఎదురుదెబ్బలకు గురవుతుంది. వందలకోట్లు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతలకు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే మధ్య తరగతి వాళ్లకు ఈ లీకులు కోలుకోలేని ఎదురుదెబ్బని ఇస్తున్నాయి. 

గేమ్ ఛేంజర్ సినిమాకు అయితే రిలీజ్ మొదటి నుంచే HD లీక్ అవ్వడం నిర్మాతను బాగా నష్టపరిచింది. సాధారణంగా, ఏ సినిమా అయినా OTT విడుదల సమయంలో HD వెర్షన్‌లు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. కానీ, ఈ సినిమాకు మాత్రం లీక్ చాలా త్వరగా జరిగింది. ఇది వసూళ్లకు భారీగా నష్టాన్ని మిగిల్చడంతో పాటు ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ పోయేలా చేసింది.

ALSO READ | Samantha: ర్యాగింగ్ తట్టుకోలేక స్టూడెంట్ మృతి.. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పందించిన సమంత..

ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ సైబర్ నేరగాళ్లపై కంప్లైంట్స్ ఇస్తున్నా, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఈ లీకుల పర్వం మాత్రం ఆగట్లేదు. అభివృద్ధి ఐనా టెక్నాలజీ సమస్యనా? లేక మనుషులలో దుర్వినియోగ  పరిచే ఆలోచన సమస్యనా? అనేది ఆలోచించాల్సి ఉంది. సినిమాను వినోదంగా చూస్తూ ఎంజాయ్ చేయాలి. వీలైతే విజ్ఞానం పొందాలి. అంతకుమించి పైరసీతో డబ్బులు సంపాదించి సైకో ఆనందాన్ని అనుభవించాలి మాత్రం అనుకోవొద్దు.

ఏదేమైనా కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఇలా పైరసీ భూతంతో కాలిపోవడం ప్రమాదం. అయితే,ఈ లీకుల విషయంపై నిర్మాతలు, సైబర్ టీమ్ ఎంత ప్రయత్నించిన తరుచూ కంటిన్యూ అవుతుండటం.. భవిష్యత్తు సినిమాలకు ప్రమాదంగా నిలిచే అవకాశముంది.

కొన్ని సార్లు సినిమా లీకులు టీమ్ నుంచే అవుతుంటాయి. మరికొన్ని సార్లు సైబర్ హ్యకర్ల నుండి లీకవుతాయి. కానీ, ఈ అత్యధునిక టెక్నాలజీలో మాత్రం లీక్ ఎక్కడ అవుతుందని మాత్రం ఖచ్చితమైన ప్లేస్ ని, మనిషిని మాత్రం గుర్తించలేకపోతున్నాం.