Daaku Maharaaj Trailer: డాకు మహారాజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

Daaku Maharaaj Trailer: డాకు మహారాజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. "డాకు మహారాజ్  థియేట్రికల్ ట్రైలర్ USA లో నేడు (జనవరి 4వ తేదీ రాత్రి 9:09PM) రిలీజ్ కానుండగా.. రేవు జనవరి 5వ తేదీ ఉదయం 8:39 AM (IST)కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల అవుతుంది" అంటూ మేకర్స్ వివరాలు వెల్లడించారు.

ఈ క్రేజీ అప్డేట్తో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ విజువల్స్ ఓ వైపు కుర్రాళ్ల గుండెల్లో, మరో వైపు సోషల్ మీడియాలో పరుగెడుతోంది. మరి ట్రైలర్ ఎలాంటి విధ్వంసం సృష్టించనుందో చూడాలి.  సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా  డాకు మహారాజ్ థియేటర్లలో విడుదల కానుంది.

ALSO READ | 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా

ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో బాలయ్యకి జోడిగా ప్రగ్య జైస్వాల్,  ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.