Daaku Maharaaj OTT Release: డాకు మహారాజ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ... ఎక్కడ చూడాలంటే..?

Daaku Maharaaj OTT Release: డాకు మహారాజ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ...  ఎక్కడ చూడాలంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ, ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన "డాకు మహారాజ్" బ్లాక్ వస్తారు హిట్  అయ్యింది. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 14న రిలీజ్ కాగా సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది. పవర్ఫుల్ ఇరిగేషన్ ఆఫిసర్ పాత్రలో కనిపించిన బాలయ్య మాస్ యాక్టింగ్ తో ఇరగదీశాడు. 

దీంతో డాకు మహారాజ్ రూ.225 కోట్లు (గ్రాస్) పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కి నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21 న డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకి జంటగా ప్రముఖ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ నటించగా బాలీవుడ్ విలన్ బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, రవి కిషన్, సందీప్ రాజ్ తదితరులు ప్రధా న తారాగణంగా నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.