బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) విడుదలైంది. ఈ సినిమా ఓవర్సీస్ టాక్ ఇప్పటికే వచ్చేసింది. ఏపీలో కూడా ఎర్లీ మార్నింగ్ 4 AM బెన్ఫిట్ షోలు పడ్డాయి. టాక్ను బట్టి చూస్తే.. బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బాబీ ‘సంక్రాంతి’ కానుకను ఇచ్చేశాడని డౌట్ లేకుండా చెప్పేయొచ్చు. ఫస్టాఫ్లో బాలయ్య ఊచకోతకు థమన్ బీజీఎం తోడై ఫ్యాన్స్కు పూనకాలేనట. ‘డాకు మహారాజ్’ సినిమా ఫస్టాఫ్లో మాస్ ఎలివేషన్స్కు కొదవే లేదట. సెకండాఫ్తో పోల్చితే ఫస్టాఫ్ అదిరిపోయిందని టాక్. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల తర్వాత మరోసారి థమన్ గట్టిగానే డ్యూటీ చేశాడని సినిమాను చూసిన ఆడియన్స్ ‘ఎక్స్’ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సెకండాఫ్ కూడా బానే ఉంది గానీ ఫస్టాఫ్ ఇచ్చినంత కిక్ ఇవ్వలేకపోయిందని, కొంచెం ల్యాగ్ అనిపించిందని టాక్. ‘డాకు మహారాజ్’ సినిమాను సెకండాఫ్ ఒక ప్రెడిక్టబుల్ ఫిల్మ్గా మార్చేసిందనేది సినిమా చూసిన ప్రేక్షకుల మాట. ఇలాంటి మాస్ సినిమాల్లో బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నటించమంటే జీవించేశాడంట. సెకండాఫ్ కొంచెం డల్ అవడం వల్ల వన్ సైడ్ హిట్ టాక్ సొంతం చేసుకునే సత్తా ఉన్న ‘డాకు మహారాజ్’ అబౌవ్ యావరేజ్ టాక్ దక్కించుకుందని సినిమా చూసొచ్చిన జనం చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘డాకు మహారాజ్’ సినిమా వన్ టైం వాచబుల్ మూవీ అని టాక్.
‘అఖండ’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు వచ్చినంత వన్ సైడ్ హిట్ టాక్ అయితే ‘డాకు మహారాజ్’కు రాలేదనే చెప్పాలి. ఓవర్సీస్లో సినిమా చూసొచ్చి ‘ఎక్స్’లో అందరి కంటే తమ అభిప్రాయాన్ని పంచుకునే రివ్యూ పేజ్ల్లో మెజారిటీ పేజ్లు ‘డాకు మహారాజ్’ సినిమాను అబౌవ్ యావరేజ్ సినిమాగా తేల్చేశాయి. ఇక.. సంక్రాంతి సినిమా విన్నర్ ఇప్పటికైతే ‘డాకు మహారాజ్’ అనే చెప్పాలి. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు అంత గొప్ప టాక్ రాకపోవడం ‘డాకు మహారాజ్’ సినిమాకు మరింత కలిసొచ్చే అంశం. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో ఇప్పటికైతే బాలయ్య సినిమానే సంక్రాంతి విన్నర్గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Also Read :- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్
వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వచ్చే టాక్తో సంక్రాంతి విన్నర్ ఈ మూడు సినిమాల్లో ఏదనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మాస్ ఆడియన్స్ బాలయ్య సినిమాకు క్యూ కట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కలెక్షన్లపై ‘డాకు మహారాజ్’ టాక్ కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా జెన్యూన్ రిజల్ట్ యావరేజ్ అయినప్పటికీ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోవడం, శంకర్ గత సినిమాలు మిగిల్చిన చేదు ఫలితాల ప్రభావం (రోబో 2, భారతీయుడు 2), సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం, సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని చేసిన నెగిటివ్ క్యాంపెయిన్.. ఇలా పలు అంశాలు యావరేజ్ ‘గేమ్ ఛేంజర్’ను ఫ్లాప్ మూవీగా చేసేశాయి.
‘డాకు మహారాజ్’ సినిమా బడ్జెట్ కూడా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో పోల్చితే తక్కువే. సో.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ అయినా ‘డాకు మహారాజ్’ సినిమా అలవోకగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. నిర్మాత నాగవంశీ ‘డాకు మహారాజ్’ సినిమా రిజల్ట్పై పెట్టుకున్న కాన్ఫిడెన్స్ దాదాపుగా నిజమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సంక్రాంతి పండుగకు ఒక మాస్ ఎంటర్టైనర్ చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ‘డాకు మహారాజ్’ మంచి ఆప్షన్ అని పబ్లిక్ టాక్తో తేలిపోయింది.