బాబీ కొల్లి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaj).ఈ మూవీ రేపు జనవరి 12న ప్రపంచవ్యాపంగా రిలీజ్ కానుంది. ఇవాళ జనవరి 11న బుకింగ్స్ షురూ చేశారు మేకర్స్. "మీ దగ్గర్లోని సినిమా థియేటర్లలో రేపు డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్.. మాస్ ఫీస్ట్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది!.. మాస్ విధ్వంసంలో పాల్గొనడానికి ఇప్పుడే మీ టిక్కెట్లను బుక్ చేసుకోండి అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
డాకు మహారాజ్ ఏపీలో టికెట్ల రేట్ చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్ థియేటర్ టికెట్ ధరపై రూ.110, మల్టీప్లెక్స్ టికెట్ ధరపై రూ.135 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణలో నార్మల్ టికెట్ ధరలే ఉన్నాయి. ‘నైజాం ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న టికెట్ల ధరలపై నేను సంతోషంగానే ఉన్నాను. టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరలేదు’ అని నిర్మాత నాగ వంశీ తెలిపిన విషయం తెలిసిందే.
ఇకపోతే డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే.. నైజాం, ఏపీలో కలిపి మొత్తం రూ.73కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. అందులో నైజాం ఏరియాల్లో రూ.21 కోట్లకు(18కోట్లు అని మరో టాక్) అమ్ముడు పోయిందట. ఇక ఏపీలో రూ.51కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అలాగే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది.
ALSO READ | Daaku Maharaaj: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. క్రిటిక్ ఉమైర్ సంధు ఎలా చెప్పాడో చూడండి
ఇందులో సీడెడ్‌లో రూ.16కోట్లు, ఆంధ్రాలో రూ.35కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు టాక్. ఆంధ్రాలో ఉత్తరాంధ్ర రూ.8.40కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.6.30కోట్లు, వెస్ట్ రూ.5 కోట్లు, కృష్ణ రూ.5.60, గుంటూరు రూ.7.20, నెల్లూరు రూ.2.80కోట్ల బిజినెస్ జరిగిందని సినీ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ రూ.73కోట్ల బిజినెస్ చేసుకుంది.
The MASS FEAST is READY to SERVE! 🔥🔥
— Sithara Entertainments (@SitharaEnts) January 11, 2025
Get your tickets NOW to be part of the MASS MAYHEM! 🪓💥
🎟️- https://t.co/douyJ3LQjI#DaakuMaharaaj BOOKINGS ARE OPEN WORLDWIDE ~ GRAND RELEASE TOMORROW at cinemas near you! ❤️🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/1IfAT0a7hB